న్యూఢిల్లీ : శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘెతో అదానీ గ్రూప్ అధిపతి గౌతం అదానీ భేటీ అయ్యారు. ఆ దేశంలోని తమ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించినట్లు అదానీ ట్వీట్ చేశారు. విక్రమ్ సింఘె ప్రస్తుతం రెండు రోజుల భారత పర్యటనలో ఉన్నారు. ”కొలంబో పోర్టు వెస్ట్ కంటైనర్ టెర్మినల్ అభివృద్థి, 500 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి చర్చించాం” అని అదాని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మద్దతుతో శ్రీలంకలో విద్యుత్, పోర్టుల అభివృద్థి తదితర ప్రాజెక్టులను అదాని గ్రూపు చేపడుతోందనే విమర్శలు ఉన్నాయి.