గవ్వ వంశీధర్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు

నవతెలంగాణ-కోహెడ :
 మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామంలో ఏఐఎస్బీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గవ్వ వంశీధర్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే సీ ఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కే సీ ఆర్ సభలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తామని, బహిరంగ సభని అడ్డుకుంటామని పోలీసులు అరెస్టు చేయడం హేయమైనచర్య అన్నారు.  అక్రమ అరెస్టులతో, ప్రజాఉద్యమాలని ఆపలేరని, ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.
Spread the love