నవతెలంగాణ-హైదరాబాద్ : గాజా నుంచి పాలస్తీనీయుల్ని ఖాళీ చేయించి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ‘గాజా అనేది పాలస్తీనీయులకు మాత్రమే చెందినది. అది వారి భూభాగం. అక్కడి నుంచి పాలస్తీనీయుల్ని బలవంతంగా ఖాళీ చేయించే ఆలోచనను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొంది. అటు అరబ్ లీగ్ కూడా అమెరికా ఆలోచనను తప్పుబట్టింది. అరబ్ ప్రపంచం దాన్ని ఆమోదించబోదని తేల్చిచెప్పింది.