ప్రమాదవశాత్తు గీత కార్మికుడు మృతి

నవతెలంగాణ – చివ్వేంల 
ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతుండగా  కింద పడి మృతి చెందిన సంఘటన  మున్సిపాలిటీ పరిధిలోని  కుడకుడ శివారులోచోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం  కుడకుడకు చెందిన  బూర సోమయ్య  (44) గీత కార్మికుడు బుధవారం ఉదయం  రోజు మాదిరిగా కల్లు గీసేందుకు  తాటి చెట్టు ఎక్కుతుండగా  మధ్యలో మోకుజారి  ప్రమాదవశాత్తు కింద పడ్డాడని  తెలిపారు.  అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు చూసి చికిత్స నిమిత్తం సూర్యాపేట  జనరల్ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కొడుకు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
Spread the love