ట్రాక్టర్ ఢీకొని గీత కార్మికుడికి తీవ్ర గాయాలు 

నవతెలంగాణ-పెద్దవంగర: ట్రాక్టర్ ఢీకొని గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, గంట్లకుంట గ్రామానికి చెందిన గుర్రం యాదగిరి కల్లు గీత వృత్తిని కొనసాగిస్తూ, గ్రామంలో తనకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి రోజు మాదిరిగానే కల్లు గీసి ఇంటికి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన పాయిలి వెంకన్న ట్రాక్టర్ అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలైన యాదగిరిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం  హన్మకొండలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.
Spread the love