
గ్రామాలలో సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, సూపర్ ఇండెంట్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ తో పాటు సాటాపూర్ గ్రామపంచాయతీలలో సాధారణ సమావేశాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, హరితహారం, మురికి కాలువలను శుభ్రం చేయడం, తదితర అంశాలపై అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి, ఆశా వర్కర్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లో గ్రామ కార్యదర్శి రాజేందర్ రవు, సాటాపూర్ జూనియర్ అసిస్టెంట్ అశోక్ రావు, కారోబార్ మంగురాం, క్షేత్ర సహాయకులు శోభన్, అర్జున్, ఆరోగ్య కార్యకర్తలు జమున, సరస్వతి, అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లకు పాల్గొన్నారు.