ఉదారత చాటిన జెడ్పీ చైర్మన్‌ పుట్ట

– స్పర్ష్‌ హస్పైస్‌కు రూ.50వేల విరాళం
నవతెలంగాణ-మల్హర్‌రావు
పేదోడికి ఆనారోగ్యం చేస్తే మంచి వైద్యం అందించాలని ఆరాటపడే బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ మరో అడుగు ముందుకు వేసి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా ఓ ఆస్పత్రికి ఏకంగా రూ.50వేలు విరాళంగా అందజేశారు.హైదరాబాద్‌లోని స్పర్ష్‌ హస్పైస్‌ ఆస్పత్రిలో మండలంలోని కొయ్యూర్‌ గ్రామానికి చెందిన ఎర్రం కిషన్‌రాజు అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా ఆయనను జెడ్పీ చైర్మన్‌ మంగళవారం పరామర్శించారు. కిషన్‌రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ క్రమంలో ఆస్పత్రి రోటరీ క్లబ్‌ ఆఫ్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తుందని వివరించారు. పూర్తివివరాలు తెలుసుకున్న ఆయన అవసాన దశలో ఉన్నపేదలను కంటికి రెప్పలా చూసుకుంటూ మంచి వైద్యం అందిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.అంతేకాకుండా ఆస్పత్రి నిర్వహణకు తనవంతుగా రూ.50వేలు అందజేశారు.విరాళంగా అందజేసి తన మానవత్వం చాటుకున్నారు. కాగా ఆస్పత్రి నిర్వహణకు విరాళం అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

 

Spread the love