– నేడు సమ్మె నోటీస్ అందజేత
– అక్టోబర్ 5 తర్వాత నిరవధిక సమ్మె
– వైద్యారోగ్యశాఖ డాక్టర్స్, పారామెడికల్ ఉద్యోగుల యూనియన్స్, అసోసియేషన్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవో 142 రద్దు చేయాలని వైద్యారోగ్యశాఖలోని డాక్టర్లు, పారామెడికల్ ఉద్యోగుల యూనియన్స్ అసోసియేషన్స్‌ల రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. బుధవారం హైదరాబాద్ కోఠి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రాంగణంలోని టిఆర్‌ఎస్కెవి రాష్ట్ర కార్యాలయంలో కె.సాయి రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. అనంతరం జీవో 142 రద్దు పోరాట కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో డాక్టర్ల యూనియన్ నుంచి డాక్టర్ బి.రమేష్, డాక్టర్ పి ప్రవీణ్, డాక్టర్ లాలు ప్రసాద్, డాక్టర్ నరహరి,టిఆర్‌ఎస్కేవి నుంచి సుదర్శన్, రాజశేఖర్, రాబర్ట్‌బ్రూస్, సీఐటీయూ నుంచి యాదానాయక్, బలరాం, ఐఎన్టీయూసీ నుంచి శ్యాంసుందర్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ నెల 21న రాష్ట్ర అధికారులకు సమ్మె నోటీస్ ఇవ్వాలనీ, 25న 33 జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేసి కలెక్టర్లకు, డీఎంహెచ్‌ఓలకు వినతిపత్రాలివ్వాలని తీర్మానించారు. అక్టోబర్ 3న ఛలో హైదరాబాద్, డీహెచ్ కార్యాలయం ముందు మహాధర్నా, అనంతరం జీవో రద్దు కాకపోతే అక్టోబర్ 5 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో గెజిటెడ్ అధికారుల నుంచి కలిముద్దీన్ అహ్మద్, శ్రీనివాసులు, సీహెచ్‌ఓల అసోసియేషన్ నుంచి బి.నెహ్రూచంద్, చంద్ర ప్రకాష్, హెల్త్ ఎక్సటెన్షన్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి కొప్పు ప్రసాద్, ఈ.కిరణ్ రెడ్డి, హెచ్‌ఈఓల యూనియన్ నుంచి వెంకటరామ్ రెడ్డి, ఏఎన్‌ఎం, హెచ్‌విపిహెచ్‌ఎన్ అసోసియేషన్ నుంచి రామేశ్వరి, ఎస్సీ.ఎస్టీ అసోసియేషన్ నుంచి రామలక్ష్మి, సుజాత రాథోడ్, ఫార్మసిస్టుల అసోసియేషన్ నుంచి బత్తిని సుదర్శన్ గౌడ్, డీపీఎంఓ లా యూనియన్ నుంచి సకలారెడ్డి, దేవ్ సింగ్, మినిస్ట్రియల్ ఉద్యోగుల నుంచి కిషన్ మాట్లాడారు. వీరితో పాటు వేణుగోపాల్ గౌడ్,అనసూర్య, మాధవరెడ్డి, పసియుద్దీన్,హరి శంకర్, భాస్కర్, సోమయ్య, రాజయ్య, యాదమ్మ, నాందేవ్, ప్రకాష్,సాంబయ్య, గోపీచంద్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.