– మెరుగైన పని పరిస్థితుల కోసం ఉద్యమించిన కార్మికులు
ఫ్రాంక్‌ఫర్ట్: రవాణా సమ్మెతో జర్మనీలో పలు ప్రాంతాలు స్తంభించాయి. స్థానిక బస్సులు, సబ్‌వే రైళ్ళు, ట్రామ్‌లు అనీ నిలిచిపోయాయి. మరింత మెరుగైన పని పరిస్థితులు కావాలని డిమాండ్ చేస్తూ కార్మికులు వారం రోజులుగా సమ్మెచేస్తున్నారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రూపు వీరి పోరాటానికి సంఘీభావం తెలిపింది. రాత్రివేళల్లో విధుల నిర్వహణకుగాను అదనపు నష్టపరిహారం ఇవ్వాలని, పని వారాన్ని మరింత తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రైలు డ్రైవర్ల యూనియన్, జర్మన్ ట్రెయిన్ డ్రైవర్స్ (జిడిఎల్), దేశంలోనే ప్రధాన రైల్వే అపరేటర్ అయిన డాయిష్ బాన్‌కు మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఎలాంటి వేతన కోత లేకుండా పని వారాన్ని 35గంటలకు కుదించాలని వారు కోరుతున్నారు.