నాలల పూడికతీత శరవేగంగా పూర్తి చేయండి

– నగర మేయర్‌ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్‌
నాలల పూడికతీత శరవేగంగా పూర్తి చేయాలని నగర మేయర్‌ శ్రీమతి గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం బల్దియా పరిధి 11వ డివిజన్‌ లోని భద్రకాళినాలాలో కొనసాగుతున్న పూడిక తీతపనులను క్షేత్రస్థాయిలో పరిశీ లించి సమర్ధంగా నిర్వహించాలన్నారు.ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో ముంపు నివారణ చర్యలలో భాగంగా గ్రేటర్‌ వరంగల్‌ పరిధి లో 33 ప్రధాననాలల పూడికతీత కొనసాగుతున్నదని, ఇప్పటికే 70 శాతం పూర్త యిందని పనుల్లో వేగంపెంచి జూన్‌ 2 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆప్‌ లో పూడికతీత నమోదు ఎప్పటికప్పు డు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ దేవరకొండ విజయలక్ష్మి సురేం దర్‌, ఏ.ఈ.శ్రీకాంత్‌,స్థానిక నాయకులు పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Spread the love