భారీ వర్షం.. జీహెచ్​ఎంసీ అప్రమత్తం

నవతెలంగాణ- హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. గత అనుభవాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. వర్షాల్లో నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్య ఉన్న వాళ్లు 040- 21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించింది.

Spread the love