నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డిని కలిసారు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత. హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎంను కలవడంతో ఆయన కూడా హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎంను డిప్యూటీ మేయర్ కలవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఆమె సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.