అనారోగ్యంతో బాలిక మృతి

– ఆర్థిక సహాయం అందజేసిన ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో బొమ్మరాజుపల్లి గ్రామంలో కొమరం జోష్నశ్రీ(11) అనే బాలిక అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. ఆ బాలిక కుటుంబం అంత్యక్రియలకు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు గుమాసు శంకర్‌ ద్వారా తెలుసుకున్న జర్నలిస్టులు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సహాయాన్ని జర్నలిస్ట్‌ లు బృహస్పతి, గుమాసు శంకర్‌ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. దాతలకు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద కుటుంబాలకు అండగా ఉంటామని ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు శ్రీరామ్‌ బృహస్పతి తెలియజేశారు.

Spread the love