విషజ్వరంతో బాలిక మృతి

 Girl died of toxic feverనవ తెలంగాణ మల్హర్ రావు.
విషజ్వరంతో అధ్యశ్రీ (8) అనే బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.మృతురాలు కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం అధ్యశ్రీ కి గత నాలుగైదు రోజులుగా జ్వరం సోకడంతో భూపాలపల్లి ప్రయివేటు ఆసుపత్రికి తీసుకపోగా వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం హన్మకొండ కు రెపర్ చేసినట్లుగా చెప్పారు. హన్మకొండ లోని ప్రయివేటు ఆసుపత్రిలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ జ్వరం సొకినట్లుగా వైద్యులు చెప్పారన్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మంగళవారం మృతిచెందినట్లుగా తెలిపారు. అధ్యశ్రీ ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ గ్రామంలో అందరికి నోట్లో నాలుకలా ఉండేదని,విషజ్వరంతో చిన్నారి మృతి చెందడంతో ఎడ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love