
విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడల్లో రానించి పాఠశాలకు సమాజానికి మంచి గుర్తింవు తీసుక రావాలని మండల విద్యాధికారి తరిరాము సూచించారు. బుధవారం మండల కేంద్రం లోని మినీ గురుకుల పాఠశాలను తనిఖీసి ప్రభుత్వం అందించిన ప్లేట్లు గ్లాసులు విద్యార్థులకు పంపిణి చేశారు. అనంతరం ఉపాధ్యాయుల రికార్డులు, పరిసరాలు,హాస్టల్ వసతిగదులు,తరగతి గదులు, వంటగది,హాస్టల్‌లో ఉన్న ఆహార దినుసులు పరిశీలించారు. సరుకులు ఏవైనా బాగోకపోతే వెండర్స్‌కి తిరిగి పంపించాలని వార్డెన్‌కి తెలిపారు. గురుకుల వసతి గ హంలోని సౌకర్యాలు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అందివ్వాల్సిన ఆహారం, విద్యా సామగ్రి, ఇతర సౌకర్యాల గురింగురించి అక్కడి పిల్లలను అడిగి తెలుసుకుంటూ, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, పాఠశాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఇంద్రశీలరాణికి సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సీఆర్పీ వెంకటయ్య, ఉపాధ్యాయులు జ్యోతి, విమల, బుజ్జి, క్రాప్ట్ టీచర్ రంగశ్రీ, కుమారి, మౌనిక సిబ్బంది ఉన్నారు.