చ‌రిత్ర‌ తిర‌గ‌రాసిన అమ్మాయిలు..

నవతెలంగాణ-హైదరాబాద్ :  మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక‌ స్కోర్‌తో రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టేసింది. దక్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో తొలి రోజే ఐదొంద‌లు బాదేసింది.  చెపాక్ స్టేడియంలో డాషింగ్ ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ‌(205) డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. వ‌న్డే సిరీస్‌లో రెండు సెంచ‌రీల‌తో మెరిసిన స్మృతి మంధ‌నా(149) శ‌త‌క గ‌ర్జ‌న చేసింది. జెమీమా రోడ్రిగ్స్(55) సైతం అర్ధ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా ఆట‌ముగిసే స‌రికి టీమిండియా 4 వికెట్ల న‌ష్టానికి 525 ర‌న్స్ కొట్టింది.

Spread the love