తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి

పలు పార్టీలు ప్రజా సంఘాల నివాళి
నవతెలంగాణ- నేలకొండపల్లి
తాటిచెట్టు పైనుండి కింద పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన బుధవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం నేలకొండపల్లి గ్రామానికి చెందిన హరి వీరస్వామి(58) మంగళవారం సాయంత్రం రోజు మాదిరిగా తాటి చెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వీరస్వామిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు, గీత కార్మిక సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Spread the love