నవతెలంగాణ -దండేపల్లి: 2024లో జరగబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన గాదె శ్రీనివాస్ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర రాజధానిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాదె శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఊహ తెలిసినప్పటి నుండి పనిచేస్తున్నామని ఎవరో మధ్యలో వచ్చి డబ్బు బలం చూపించి తమకు సీటు కావాలని తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వానికి అన్ని తెలుసు అని వారు అన్ని గమనిస్తున్నారు అని అర్హులైన వారికే ఎన్నికల్లో సీటు కేటాయిస్తారని 2024 లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తనకే సీటు తగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట మంచిర్యాల అసెంబ్లీ కోఆర్డినేటర్ బిజెపి రాష్ట్ర నాయకులు మేరీ మాటి మెరదేశ్ ఆయనను బలపరిచారు. తనకు సీటు కేటాయిస్తే ప్రజా సేవ చేసి పార్టీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.