సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వండి: మంత్రి తుమ్మల

నవతెలంగాణ సిరిసిల్ల: సంక్షోభం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమలను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పరిశ్రమలను మూసివేయడానికి కారణాలు తెలుసుకొని ప్రభుత్వం తరఫున సహాయాన్ని అందించాలని సంబంధిత శాఖ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చేనేత శాఖ కమిషనర్‌ అలుగు వర్షిణిని ఆదేశించారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని.. అందుకే పెట్టుబడి పెట్టి ఉత్పత్తి కొనసాగించలేకపోతున్నామని పలువురు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love