ప్రతిపక్ష నాయకులు పొందిన సంక్షేమాలను వీడిసికి ఇవ్వండి: ఎమ్మెల్యే

నవతెలంగాణ- నవీపేట్: కేసీఆర్ సంక్షేమ పథకాలు పొందుతూ విమర్శించే ప్రతిపక్ష నాయకులు పొందిన సంక్షేమాలను తిరిగి ఆ గ్రామ వీడీసీలకు ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు అభంగపట్నం,మద్దేపల్లి, జన్నేపల్లి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను గురువారం చేశారు. అభంగపట్నంలో 12 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాం, మద్దేపల్లిలో మూడు కోట్లతో బీటీ రోడ్డు, జన్నేపల్లిలో 20 లక్షలతో జిపి భవన ప్రారంభోత్సవం మండల పరిషత్ కార్యాలయంలో నూతన సమావేశపు గది, గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి పూజ మరియు సెంట్రల్ లైటింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిందని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, సాగునీరు మరియు ధాన్యం కొనుగోలు చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తుందని అన్నారు. కెసిఆర్ సంక్షేమ పథకాలను పొందుతూ కాంగ్రెస్ బిజెపి నాయకులు విమర్శిస్తున్నారని అటువంటి వాళ్ళు దమ్ముంటే పొందిన లబ్ధిని గ్రామాభివృద్ధి కమిటీకి అందించాలని అన్నారు. 15 సంవత్సరాలు మంత్రిగా చేసిన సుదర్శన్ రెడ్డి ఎర్రగుంటను పూర్తి చేయాలేని అసమర్థుడని అన్నారు.బోధన్ లో ఇల్లు కూడా నిర్మించుకోని వ్యక్తి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాడని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డి గెలిస్తే మళ్లీ దరిద్రం తెచ్చుకున్నట్టేనని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిజెపిలో ఇద్దరు సీజనల్ నాయకులు ఉన్నారని వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇందూరు హరీష్, జెడ్పిటిసి సవిత బుచ్చన్న, సర్పంచ్ ఏటిఎస్ శ్రీనివాస్, రేణుక రవి, సబితా సంజీవరావు, అనురాధ, సొసైటీ చైర్మన్ అబ్బన్న,వైస్ చైర్మన్ బాబర్, కృష్ణమోహన్, మీనా నవీన్ రాజ్, తెడ్డు పోశెట్టి, లోకం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love