నవతెలంగాణ హైదరాబాద్: వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే రిటైర్ అయిన తర్వాత కూడా రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధుల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. రేపు (జనవరి 17వ తేదీ) సాయంత్రం 5 గంటల లోపు ఈ వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు.