ఒకసారి అవకాశం ఇవ్వండి..

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఒకసారి అవకాశం ఇవ్వండి.. ఆశీర్వదించి గెలిపించాలని బీజేపీ నేత పైడి రాకేష్ రెడ్డి అభ్యర్థించారు. మండలంలోని  మగ్గిడి, ఖానాపూర్, అమ్డపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గ  బీజేపీ నేత  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడి ప్రజలు అవకాశం ఇచ్చారని కానీ వారి పరిపాలన అంతా అవినీతి జరిగిందని పలు పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు అదేవిధంగా బీజేపీ   అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని అన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు పార్టీ కార్యకర్తలకు బంధువులకు ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు, మండలంలోని  కవితపుర్ అంటూ ఖానాపూర్ గ్రామాన్ని  ఎక్కడ అభివృద్ధి చేయకుండా మట్టి గోడలు దర్శనం ఇస్తున్నాయి అని బీజేపీ వస్తె మొట్టమొదటగా ఖానాపూర్ గ్రామాన్ని పునర్నిర్మాణం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు విజయభారతి,  మండల రోహిత్ రెడ్డి, అందపుర్ రాజేష్, నియజకవర్గ కన్వీనర్ పలేపూ రాజు, ఒబిసీ మొర్చ ఉపాధ్యక్షుడు గంగాధర్ ,వినోద్  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love