రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేసే మా కుటుంబానికి మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలని మద్నూర్ మండల మాజీ ఎంపీపీ మీరేవార్ గంగారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు విన్నవించుకున్నట్లు ఆయన సోమవారం నాడు నవతెలంగాణతో మాట్లాడుతూ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లచ్చన్ గ్రామానికి 1995లో సర్పంచ్ గా పోటీ చేసి ఎన్నికయ్యానని ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఎన్నిక కావడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత మా కుటుంబానికి అవకాశం మళ్ళీ రావడం 2019లో సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందడం జరిగిందని తెలిపారు. ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ తరపున జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోయినప్పటికీ మా కోడలు పిల్ల అర్చనకు మండల జడ్పిటిసిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయించడం జరిగిందని, రెండు మూడు వేల ఓట్ల మెజార్టీతో జడ్పిటిసిగా ఓడిపోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి మా కుటుంబం పనిచేస్తుందని, ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు వచ్చినట్లు తెలిసింది. ఆ పదవికి మా కుటుంబానికి ఎమ్మెల్యే సహకరించి అవకాశం ఇవ్వాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. రెండుసార్లు సర్పంచుగా ఒకసారి ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందడం జరిగిందని, అవకాశమిచ్చినందుకు ఎంపీపీగా కొన్ని సంవత్సరాల పాటు పని చేసిన కుటుంబానికి మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అవకాశం ఇచ్చి ఆదుకోవాలని, పార్టీకి కట్టుబడి పని చేసే కుటుంబాన్ని గుర్తించాలని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు ఆయన తెలిపారు.