– బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజుబుద్దిన్
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ముజబుద్దీన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పారసీ రాముల కళ్యాణమండపంలో కామారెడ్డి నియోజకవర్గ కామారెడ్డి, రామారెడ్డి మండల మున్సిపాలిటీలో ఏడు వీలీన గ్రామాలకు చెందిన బారాస పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి బి.ఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలన్నారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంటు బి ఆర్ ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ..తనను గెలిపిస్తే కామారెడ్డి జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు. తాను రైతు బిడ్డనని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తనను గుర్తించి కేసీఆర్ తనకు జహీరాబాద్ పార్లమెంటరీ టికెట్ ఇచ్చారని అన్నారు. మే 13న కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో బారాస మెజార్టీ స్థానాలు గెలిపించుకుంటే కేంద్రంలో మన బలమేంటో తెలుస్తుందని ఆయన అన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కాదు 420 అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ ఫైల్ పై సంతకం పెడతానని వంద రోజులు గడిచిన పెట్టలేదు అన్నారు. ఇప్పటివరకు ఆ ఊసే లేదని రైతులకు రైతుబంధు ఇప్పటివరకు కేవలం ఐదు ఎకరాల లోపు వారికే వచ్చిందని అది కూడా మన ప్రభుత్వ హాయంలో ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చే రూపాయలె ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.15000 ఇస్తామని చెప్పి ఇప్పుడేమో రూ.10,000 రూపాయలు ఇస్తుందని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి మాత్రమే అమలు చేసిందని, ఇప్పుడు ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లిందని ఆ అప్పు ఎట్లా కడుతుందో చూడాలని అన్నారు. కామారెడ్డి నుండి పోటీ చేసిన కేసీఆర్ ఎలా ఓడిపోయారు, ఇప్పటివరకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, తోపాటు రామారెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు.