నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపు

నవతెలంగాణ-ఆత్మకూర్‌
హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండల కేంద్రానికి చెందిన రేవూరి కొమురారెడ్డి 62సం. ఆదివారం గుండె పోటుతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారంతో సమాజ హితం కోరి నేత్రదానం చేయుటకు ముందుకు వచ్చారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసి యేషన్‌ వరంగల్‌, అలయన్స్‌ క్లబ్‌ ముచ్చర్ల ఆధ్వర్యంలో వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సిబ్బంది ఎల్వి ప్రసాద్‌, ఐ టెక్నీషియన్‌ నరేందర్‌ ద్వారా కార్నియా సేకరణ నేత్రదానం చేసారు. ఈ నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు నిచ్చినారని,నేత్ర వైద్యవిద్య కు కూడా తోడ్పడు తుందని అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాద ములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్‌ అందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దేవికి, భాగ్యలక్ష్మి,రమాదేవి,సుధాకర్‌ రెడ్డి,రాజమణి,దేవాల్‌ రెడ్డి, మల్లారెడ్డి,జయపాల్‌రెడ్డి, అసోసియేషన్‌ అధ్యక్షులు కొండ్రెడ్డి మల్లారెడ్డి,లయన్స్‌ క్లబ్‌ ముచ్చర్ల బండ సాయిరెడ్డి, రవీందర్‌ ఇంజనీర్‌, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love