నవతెలంగాణ – రేవల్లి: రేవల్లి మండల కేంద్రంలో కూతవేటు దూరంలో వడ్డే గేరి ప్రాంతం ఉన్నది. రేవల్లి మండల కేంద్రంలో 24 గంటలు కరెంటు సప్లై ఇవ్వడానికి అనవుగా లెవెన్ కె.వి ఫీడర్ ఉన్నది. వడ్డగేరి ప్రాంతానికి మాత్రం ఇప్పటివరకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి లెవెన్ కె.వి ఫీడర్ లేదు. చెప్పుకోవడానికి మాత్రం రేవల్లి గ్రామము మరియు మండలము. ఇప్పటికైనా మా వడ్డే గేరికి 24 గంటల కరెంటు సప్లై ఇవ్వవలసిందిగా విద్యుత్ అధికారులను వడ్డె గేరి స్థానికులైన శివ మరియు గణేష్ తదితరులు కోరారు. దీనికి సంబంధించి వడ్డే గేరికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయమని రేవల్లి సర్పంచ్ మండల విద్యుత్ అధికారి అయిన ఏఈ శ్రీశైలం కు చెప్పడం జరిగింది.
విద్యుత్ ఏఈ శ్రీశైలం వివరణ
పై విషయంపై రెండు రోజుల క్రితమే రేవల్లి గ్రామ సర్పంచ్ గౌతమి శివరాం రెడ్డి వడ్డే గేరికి 24 గంటల కరెంటు విద్యుత్ సరఫరా చేయమని కోరారు. అదేవిధంగా శివ మరియు గణేష్ తదితరులు 20 మంది దాకా సబ్స్టేషన్ వద్దకు చేరుకొని తమ యొక్క పరిస్థితిని వివరించి 24 గంటల కరెంటు సప్లై ఇవ్వమని అడిగారని చెప్పారు, వడ్డె గిరి 24 గంటల సప్లై కొరకు రేవల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి శివరాం రెడ్డి మరియు కొమ్మిడి రవీందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగిందని, ఈ విషయంపై పై అధికారులను సంప్రదించి వారికి అతి త్వరలో 24 గంటల కరెంటు సప్లై వచ్చే విధంగా కృషి చేస్తానని రేవల్లి మండల ఏఈ శ్రీశైలం తెలియజేశారు.