మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్ 

– అదనపు కలెక్టర్ కాళ్ళపై పడి వేడుకున్న శానిటేషన్ సిబ్బంది 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
తొలగించిన తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని శానిటేషన్, పేషంట్ కేర్ సిబ్బంది గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన అదనపు కలెక్టర్ పూర్ణచంద్రం కాళ్లపై పడి మా పొట్ట కొట్టదు అంటూ వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశానుసారం ఇటీవలే ఇద్దరు వార్డు బాయ్ లను తొలగించారు. వార్డ్ బాయ్ లు చేసిన పని శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బందిపై కూడా పడటంతో బుధవారం మధ్యాహ్నం ఇద్దరు పేషట్ కేర్లు, ఇద్దరు శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా ఎంసీఎచ్ లో పనిచేసే మరో ఇరువురు వర్కర్లను విధుల నుండి తొలగించారు. దీంతో వారు ధర్నా నిర్వహించారు. వారి గోడును అదనపు కలెక్టర్ కు విన్నవించి అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు విధుల్లో చేరారు. మేము ప్రభుత్వ ఉద్యోగులము కాదు. మావి పెద్ద పెద్ద జీతాలు కావు. ఎలాంటి హెచ్చరిక లేకుండా  తొలగిస్తే రోడ్డున పడతామని ఆవేదన చెందారు. ఎవరైనా తెలుసో .. తెలియకనో ..తప్పు చేస్తే హెచ్చరించి ఒకసారి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. అలా కాకుండా నేరుగా విధులనుంచి తొలగిస్తే రోడ్డు న పడతామని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా తొలగించిన సిబ్బందిని వీధులలోకి తీసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Spread the love