మాకు మీ స్నేహ హస్తాన్ని అందించండి : జిపి కార్మిక జేఏసీ

నవతెలంగాణ-కొత్తగూడెం:– గ్రామపంచాయతీ కార్మికులందరికీ మీ స్నేహ హస్థాన్ని అందించి అండగా నిలవాలని గ్రామపంచాయతీ కార్మిక జేఏసీ అధ్యక్షులు గుగ్గిళ్ళ వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారానికి 32వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ కట్టుకొని వినూత్నమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేం సమ్మె చేస్తూ 32 రోజులు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో జీవో నెంబర్ 51 రద్దుచేసి అన్ని కేటగిరిల సిబ్బందికి వేతనం పెంచి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని లేనియెడల మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది రమేష్, వేణు, శంకర్, సుమన్, బిక్షపతి, కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్, మురళి, రమణయ్య,కిరణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love