ప్రయివేట్‌ సంస్థలకు ఇస్తే సహించేది లేదు

Rangareddy,Telugu News,Telangana,Telangana News – మధ్యాహ్న భోజన కార్మికుల
– యూనియన్‌ జిల్లా కోషాధికారి సరిత
– మండల ఐఆర్‌పీకి వినతిపత్రం
నవతెలంగాణ-మంచాల
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేట్‌ సంస్థలకు ఇస్తే సహించేది లేదని మధ్యాహ్న భోజనం పథకం యూ ని యన్‌ జిల్లా కోశాధీకారి సరిత ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. మంగళవారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆద్వర్యంలో ధర్న నిర్వహించి అనంతరం ఐఅర్‌పీ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాటా ్లడుతూ.. మధ్యహ్న భోజన పథకాన్ని హరే రామ-హరేకష్ణ లాంటి సంస్థలకు ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు జరుపుతు న్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల పై చిలుకు కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారని తెలిపారు. సంవత్స రా నికి ఒకటి, రెండు సార్లు బిల్లులు, జీతాలు వచ్చిన చేసి వంటలు చేసి పెడుతు న్నామని గుర్తుచేశారు. బిల్లులు సకాలంలో అందించక ప్రభు త్వం మధ్యాహ్న భోజన కార్మి కుల పట్ల నిర్లక్ష్యం జరుగుతుం దని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా మధ్యాహ్న భోజనాన్ని హరే రామ హరే క్రిష్ణ, అక్షయ పాత్ర లాంటి సంస్థలకు అప్పజెప్పాలని కొడంగల్‌ పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకో వాడానికి ప్రయ త్నించారన్నారు. లేని పక్షంలో పోరాటం ఉదతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్ర మంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్‌ నాయకులు అలివేలు, రాజమ్మ, లక్ష్మమ్మ, భారతమ్మ, అనిత, రాణీ, యాదయ్య, రాధమ్మ, పెంటమ్మ, తదితరులున్నారు.

Spread the love