ఐస్‌ క్రీంలో గాజు ముక్కలు

య్– వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు
నవతెలంగాణ-బోడుప్పల్‌
ఐస్‌ క్రీం కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఐస్‌ క్రీంలో గాజు ముక్కలు వచ్చాయి. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ వీరారెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న విజయ్ కుమార్‌గౌడ్‌ పిల్లల కోసం సమీపంలోని మహాలక్ష్మి కిరాణం స్టోర్‌లో ఐస్‌ క్రీం (క్వాలిటీ వాల్స్‌)లు మూడు కొనుగోలు చేశాడు. అయితే, వాటిని తింటుండగా గాజు పెంకులు బయటపడ్డాయి. దీంతో కొనుగోలుదారుడు వెంటనే షాప్‌ యజమానిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని, మీరు కొనుగోలు చేసిన ఐస్‌ క్రీం కంపెనీ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించాడు. విజరు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏది పడితే అది కొనుగోలు చేసి తినకూడదని, తాను పిల్లల కోసమని ఐస్‌ క్రీం కొనుగోలు చేస్తే గాజు పెంకులు వచ్చాయని అన్నారు. ఒకవేళ అవి చూడకుండా తింటే తమ పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యేవని ఆందోళన వ్యక్తం చేశారు. తిండి పదార్థాల తయారీలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

Spread the love