క్షేత్రస్థాయికి వెళ్లండి

Go to the field– సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేయండి … పథకాల అమలులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించండి
– ఏసీ గదులకే పరిమితమైతే సంతృప్తి ఉండదు
– ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలనందించాలి
– ఒక శంకరన్‌, శ్రీధరన్‌లా గుర్తింపు తెచ్చుకోండి : కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పని చేయండి. ప్రభుత్వానికి కండ్లు, చెవులు జిల్లా కలెక్టర్లే. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలుం డాలి. ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలనందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకూ ఎలాంటి సంతృప్తి ఉండదు.. ఒక శంకరన్‌, ఒక శ్రీధరన్‌ మాదిరిగా సామాన్య ప్రజలెప్పుడూ గుర్తు పెట్టుకునేలా పని చేయాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాల యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్ల సదస్సులో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్‌తోపాటు అన్ని శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని పేర్కొ న్నారు. పథకాలను చివరి లబ్దిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్య మంత్రి గుర్తు చేశారు. ఏ జిల్లాలో
పని చేసినా అక్కడి ప్రజల మదిలో చెరగని పని చేసినా అక్కడి ప్రజల మదిలో చెరగని
ముద్ర వేయాలని సూచించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల టీచర్లు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు వాళ్లకు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మీడియాలో చూసినట్లు సీఎం చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరుండాలని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్‌ అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారనీ, విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి, భాషతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని వారికి సూచించారు. ప్రభుత్వానికి కండ్లు, చెవులు జిల్లా కలెక్టర్లేననీ, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు అంశాల వారీగా మార్గనిర్దేశం చేశారు.
మహిళా శక్తి
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. గృహజ్యోతికి 5.89 లక్షల మంది, రూ. 500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాలు చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు.
ధరణి
పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ”ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారు” అని అధికారులు సీఎంకు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్నికూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు.
ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని పేర్కొన్నారు.. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని సూచించారు.. రాష్ట్రంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ను అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రూరల్‌ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాని పేర్కొన్నారు..
వనమహౌత్సవం
వనమహౌత్సవం కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్దఎత్తున చేపట్టినట్టు కలెక్టర్లకు సీఎం చెప్పారు. అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడం వలన ఓ వైపు గిరిజనులకు ఆదాయం, మరో వైపు పచ్చదనం పెంపొందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వికారాబాద్‌ హవా.. టీబీకా దవా అనే (వికారాబాద్‌ గాలి.. టీబీకి మందు) నానుడి ఉందనీ, కానీ ఇప్పుడు వికారాబాద్‌ అటవీ ప్రాంతం చాలా వరకు ఖాళీగా ఉందన్నారు. అక్కడ గతంలోలా ఔషధ మొక్కలు నాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పులుల సఫారీకి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతానికి వెళుతున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ అటవీ ప్రాంతం ఉన్నా పులులు సంచారం లేదనీ, వాటికి అవసరమైన ఆవాసం, నీటి సౌకర్యం కల్పిస్తే అటవీ పర్యాటకం పెంపొందించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.
శాంతి భద్రతలు
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ బాధితులతోనే కానీ నేరస్థులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పబ్బులు విషయంలో టైమింగ్‌ పెట్టొచ్చనీ, ఆంక్షల పేరుతో రాత్రి వేళ్లల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్‌లకు ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్రగ్స్‌ విషయంలో పోలీసు, ఎక్సైజ్‌, టీజీ న్యాబ్‌ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. డ్రగ్స్‌తో పట్టుపడిన వారిని డీఅడిక్షన్‌ సెంటర్లో ఉంచాలనీ, ఇందుకోసం చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
వ్యవసాయం
కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు, యూరియా సిద్ధంగా ఉన్నాయని, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే కలెక్టర్లు జాగ్రత్త వహించాలని మంత్రి అన్నారు. కొన్ని సార్లు కత్రిమ కొరత సష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
విద్య
”ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు పెడుతుంది. తెలం గాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్య త్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడె న్షియల్‌ పాఠశాలలను 20 నుంచి 25 ఎక రాల్లో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. రహదారులకు అను సంధానంగా ఉండే గ్రామాలు, పట్ట ణాల్లో వాటికి స్థలాల ఎంపిక చేయండి” అని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌ గ్రేడ్‌ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలి పారు. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయడంతో పాటు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేసేలా చూడాలని ఆదేశించారు.

Spread the love