– ప్రత్యేక పూజల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
నవతెలంగాణ- మద్నూర్
ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందమయంగా జీవించే విధంగా చూడుము దుర్గామాత దేవి కి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరుకున్నట్లు పేర్కొన్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఆదివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో గల డాక్టర్ బండి వార్ విజయ్ ఇంటి ముందర ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహానికి ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా దుర్గామాత దేవికి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించాలని దుర్గామాత దేవికి మొక్కుకున్నారు. ఎంపీ దుర్గామాత ప్రత్యేక పూజల్లో పాల్గొనగా ఆయనతోపాటు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవ కమిటీ ప్రముఖులు మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ యువ నాయకులు అక్షయ పటేల్ మద్నూర్ గ్రామ సర్పంచ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు గఫర్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ మండల యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్ మద్నూర్ మండల సొసైటీ మాజీ చైర్మన్లు పండిత్ రావు పటేల్ పాకల విజయ్ మండల జడ్పిటిసి కుటుంబ సభ్యులు కథలయ్య మైనారిటీ నాయకులు మొహినోద్దీన్ పటేల్ మహమ్మద్ పటేల్ శాఖాపూర్ సర్పంచ్ ఎంకే పటేల్ లింబూర్ గ్రామ సర్పంచ్ డోంగ్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మధుకర్ పటేల్ ఎంపీటీసీల పోరం అధ్యక్షులు దిన్ దయాల్ గోజేగావ్ సర్పంచ్ పెద్ద సక్కర్గ గ్రామ సర్పంచ్ వీరితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు దుర్గామాత దీక్ష స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.