భారీగా పడిపోయిన బంగారం, వెండి ధ‌ర‌లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో మంగ‌ళ‌వారం బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) రూ.650 తగ్గి రూ.57,550 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంత‌కుముందు ట్రేడింగ్‌లో తులం బంగారం (24 క్యార‌ట్స్‌) ధ‌ర రూ.58,200 ప‌లికింది. మ‌రోవైపు కిలో వెండి ధ‌ర రూ.1800 త‌గ్గి రూ.71,500కి ప‌డిపోయింది. కామెక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధ‌ర‌లు ప‌డిపోయాయి. దేశీయంగా బులియ‌న్ మార్కెట్లు సోమ‌వారం ప‌ని చేయ‌లేదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ క‌మొడిటీ రీసెర్చ్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ న‌వ్‌నీత్ ద‌మానీ తెలిపారు.

Spread the love