నవతెలంగాణ- హైదరాబాద్: మన భారతీయ మహిళల కు బిగ్ షాక్ తగిలింది. బంగారం కొనుగోలు చేసే వారికి షాక్ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. తాజాగా హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 పెరిగి రూ. 60, 440 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1400 పెరిగి రూ. 55, 400 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 77, 000 గా నమోదు అయింది.