Gold Price Today: అక్షయ తృతీయ పండగ సందర్భంగా ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు తక్కువగానే ఉన్నాయి. ధరలు అధికంగా ఉన్నప్పటికీ అక్షయ తృతీయ పండగ సీజన్‌లోనే బంగారం సేల్స్ భారీగా పెరిగాయి. మరో మూడు రోజుల్లో దేశీయంగా నవరాత్రి ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ధరలు తక్కువగా ఉండటం, సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రధానాంశాలు:
- నేడు పెరిగిన బంగారం, వెండి ధరలు
- హైదరాబాద్‌తో పాటు అన్ని మార్కెట్లలో ధరల పెంపు
- మరో మూడు రోజుల్లో దేశీయంగా నవరాత్రి సీజన్
- గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే రేట్లు
Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడంతో పడిపోయిన బంగారం ధరలు… ఆ తర్వాత మళ్లీ వెంటనే కోలుకున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.46 వేలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.24 పెరిగి రూ.50,200గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా పరుగులు పెట్టాయి. కేజీ వెండి ధర రూ.800 పెరిగి రూ.63 వేలకు ఎగిసింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తర్వాత.. బంగారం ధరలు కిందకి పడిపోయాయి. కానీ మళ్లీ ఎలాంటి గ్యాప్ లేకుండానే ధరలు పుంజుకున్నాయి.