భారీగా పెరిగిన బంగారం ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధర భారీగా పెరిగింది. నిన్నపెరిగిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 73, 260 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67, 160 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు పెరిగిన నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 87, 700 గా నమోదు అయింది. అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 80 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Spread the love