స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 10 పెరిగి ప్రస్తుతం రూ. 57 వేల 410కి చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 62 వేల 630 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.10 పెరిగి రూ. 57 వేల 560 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ. 10 పెరిగి రూ. 62 వేల 780 వద్దకు చేరింది. ఓవైపు బంగారం ధరలు పరుగులు పెడుతూ షాకిస్తున్న తరుణంలో వెండి మాత్రం ఊరట కలిగిస్తోంది. గత రెండు రోజులుగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకు ముందు రోజు కిలో వెండి రేటు రూ.500 మేర దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రేటు ఢిల్లీలో రూ. 74 వేల 600 మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలాగే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 77 వేల 500 మార్క్ వద్దకు చేరింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే బంగారం రేటు మాత్రం చాలా తక్కువకే లభిస్తుంది.

Spread the love