న్యూఢిల్లీ : బంగారం ధరలో తగ్గుదల చోటు చేసుకుంది. శనివారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.330 తగ్గి రూ.60,870 వద్ద ముగిసింది. గోల్డ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల పసిడిపై రూ.300 తగ్గి రూ.55,800గా పలికింది. మరోవైపు కిలో వెండిపై రూ.200 తగ్గి రూ.74,300గా చోటు చేసుకుంది. హైదరాబాద్, కోల్‌కత్తాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,870గానే ఉంది.