సికింద్రాబాద్‌లో రూ.29 లక్షల విలువైన బంగారం సీజ్

నవతెలంగాణ-హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన రసీదులు లేని 55 తులాల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. జనరల్ బజార్‌కు తరలిస్తున్న రూ.29 లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. బంగారం తరలిస్తున్న సబుద్దీన్, హుస్సేన్, అజార్ అలీ, సాహేల్, నవీన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బుధవారం ఒక్క రోజే రూ.10 కోట్లు విలువైన బంగారం, వెండి, నగదును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే

Spread the love