డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందుటకు సువర్ణావకాశం

నవతెలంగాణ- ఇల్లంతకుంట:
మండల పరిధిలోని యువకులకు సిరిసిల్ల జిల్లా పోలీస్‌ శాఖ వినూత్న అవకాశాన్ని కల్పిస్తుందని స్థానిక ఎసై సుధాకర్‌ తెలిపారు. ఆటోలు, బైకులు నడుపుతున్న లేదా డ్రైవింగ్‌ చేయాలన్న ఉత్సాహం ఉన్న యువకుల కోసం ప్రత్యేక డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తులు తమ యొక్క ఆధార్‌ కార్డును, ఏడవ తరగతి ఆపైన చదివిన పాస్‌ సర్టిఫికెట్‌ తీసుకొని పోలీస్‌ స్టేషన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మండలంలోని యువకులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం మధ్యవర్తులను గాని బ్రోకర్లను గాని సంప్రదించవద్దని నేరుగా పోలీస్‌ స్టేషన్లో తమ వివరాలు సమర్పించినట్లయితే సులువుగా సజావుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చేటట్టు చూడడం జరుగుతుందన్నారు . శుక్రవారం సాయంత్రం లోపు వివరాలను నమోదు చేయిం చుకోవాలని అయన తెలిపారు.

Spread the love