సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్..

నవతెలంగాణ – హైదరాబాద్: బీసీసీఐ సెక్రటరీ జైషా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టికెట్ అందజేశారు. ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ కార్యక్రమంలో భాగంగా షా సచిన్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చినట్లు బీసీసీఐ ట్విట్టర్ లో ప్రకటించింది. ఇప్పటికే సినీ దిగ్గజం బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఈ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్ ద్వారా వరల్డ్ కప్-2023 మ్యాచ్లను ఉచితంగా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.  కాగా, అక్టోబర్ 5 నుంచి భారత్ లోని అహ్మదాబాద్ వేదిక WC ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లు చూసేందుకు ఫ్యాన్స్ కోసం బీసీసీఐ 4 లక్షల టికెట్లను విక్రయించనుంది. టికెట్ల విక్రయం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. వీటిని ప్రపంచకప్ వెబ్సైట్ లో కొనుగోలు చేయవచ్చు.

Spread the love