తమిళనాడులో ఈనెల 19, 20, 21 తేదీలలో జరగబోయే ఏ ఏ ఆర్ ఎం (ఆర్మ్) ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచి అఖిలభారత మహాసభలకు ములుగు జిల్లా నుండి బొంది రాజేష్ ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆదివాసీ గిరిజన సంఘం సహాయ కార్యదర్శి కోటి కృష్ణారావు ఆదివార పత్రికలకు వెల్లడించారు. గొంది రాజేష్ ఎన్నిక కృష్ణారావుతోపాటు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అఖిల భారత మహాసభలకు అందరికి అవకాశం రాదని ఈ ఎన్నికకు అనేక కొలమానాలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తాం గా ఆదివాసి ఉద్యమాలలో పాల్గొన్న పలువురు నాయకులు మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొంటారని అన్నారు. గిరిజన హక్కుల కోసం గ్రీన్ చట్టాలను చేయాలని, ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు వ్యతిరేకంగా అనేక ఉద్యమాన్ని నిర్వహించి జైలుకుపోయిన అనేకమంది పోరాట యోధుల మహాసభకు ఎన్నికవుతారు. దేశవ్యాప్తంగా 500 మంది ఈ మహాసభకు హాజరవుతున్నారు. ఈ మహాసభలు అనేక విషయాలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. మన జిల్లా నుండి గొంది రాజేష్ ఎన్నికవ్వడం హర్షించ దగ్గ విషయం . ఈ జిల్లా నుండి ఒకరే ప్రతినిధి ఎన్నిక కావడం జరిగింది. ఇతని ఎన్నిక పట్ల జిల్లా నాయకులు , ఆదివాసీ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు సెంట్రల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.