ఆరోగ్యానికి మేలు…

ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దాని వల్ల చాలా మంది చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు. మనం వాడే బియ్యం, చపాతీల్లో అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. వాటితో పాటు మన కూరల్లోనూ కొవ్వు ఎక్కువే. ఈ కొవ్వు పదార్థాలు ఆహారంలో క్యాలరీలను పెంచుతాయి. దాంతో బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గేందుకు మీ ఆహారంలో వీటిని చేర్చండి.
– పసుపు, నల్ల మిరియాలు, లవంగం, జీలకర్ర, ఆవాలు మీ వంటకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల వల్ల వీటిని మందుల తయారీలోనూ వాడుతారు. వీటిలో వుండే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. శరీరంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అధిక బరువు తగ్గేందుకు ఇవి సాయపడతాయి.
– కూరలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే సరిపడా కొవ్వునే వాడాలి. రిఫైన్డ్‌ నూనెకు బదులు నెయ్యి వాడండి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు మేలు చేసి అధిక బరువు సమస్య నుంచి తొందరగా బయటపడేలా చేస్తుంది.
–  మనం చపాతీలను గోధుమపిండితో తయారు చేస్తాం. వీటిలో పిండిపదార్థాలు ఎక్కువ. అందువల్ల గోధుమకు బదులు జొన్నలు, సజ్జలు, రాగులు వంటి వాటిని వాడితే మేలు. వీటితో తయారు చేసిన చపాతీలలో ప్రోటీన్‌, ఫోలేట్‌, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
–  మనం ఇంట్లో చేసే చపాతీల నుంచి కూరల వరకు అన్నింట్లో ఆరోగ్యకరమైన పోషక పదార్ధాలు ఉంటాయి. అందుకే ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాసెస్‌ చేసిన, ప్యాకింగ్‌ చేసిన, రెడీ టు ఈట్‌ ఆహారానికి దూరంగా ఉండాలి. దాన్ని ఎంత తగ్గిస్తే అంతగా బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.
–  రోజూ ఒకే ఆహారాన్ని తీసుకోవడం ఎవరికైనా నచ్చదు. అందువల్ల కొంచెం వైవిధ్యమైన రుచి కోసం ప్రయత్నించండి. పోహా, ఇడ్లీ, సాబుదానా ఖిచి, ఉప్మా వంట వాటిని తినండి. తద్వారా మీరు అధిక బరువు సమస్య నుంచి త్వరగా కోలుకుంటారు.

Spread the love