గుడ్ న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో దేశంలో 65వేలు+ 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 2వేల కంటే ఎక్కువ టవర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో 675, రంగారెడ్డిలో 100, మెదక్‌లో 158, నల్గొండలో 202, మహబూబ్‌నగర్‌లో 151, ఆదిలాబాద్‌లో 141, నిజామాబాద్‌లో 113, కరీంనగర్‌లో 98, వరంగల్‌లో 231, ఖమ్మంలో 219 టవర్స్ ఏర్పాటు చేశామంది.

Spread the love