ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌..

వతెలంగాణ – అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగుల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సీఎం జ‌గ‌న్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు. 897 పోస్టుల‌తో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 897 పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్నారు. గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌తో ఏపీ నిరుద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Spread the love