నవతెలంగాణ – హైదరాబాద్ : మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఐదు కంపెనీలకు కాంగ్రెస్ సర్కారు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. వీటిలో క్రాఫ్ట్ బీర్లే అధికంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో బీర్ల కొరతను అధిగమించేందుకే ఎక్సైజ్‌శాఖ తెలంగాణలో కొత్తగా 27 రకాల బీర్లు రాబోతున్నాయి. దీనికోసం ఇప్పటికే కొత్తగా ఐదు బీర్ల తయారీ కంపెనీలకు ఈ ఏడాది రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే, వీటిలో అధికంగా క్రాఫ్ట్ బీర్లే ఉన్నట్లు సమాచారం. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కొత్తగా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిట్ బ్రేవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సోటికా లిక్కర్ ప్రైవేట్ లిమిటెడ్, మౌంట్ ఎవరెస్ట్ లిమిటెడ్, లీలాసన్స్ ఆల్కా బేవ్ ప్రైవేట్ లిమిటెడ్, సోం డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న బీర్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా బీర్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది.