ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం వడ్డీ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (సీబీటీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేటుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 8.10 వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్.

Spread the love