ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..డిగ్రీ ప్రవేశాల్లో కొత్త కోర్సులు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గుడ్ న్యూస్ చెప్పారు. డిగ్రీ ప్రవేశాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1060 డిగ్రీ కళాశాలల్లో దాదాపు 2లక్షల వరకు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో స్కిల్ ఇంప్రూవ్ టార్గెట్‌గా బీబీఏ రిటైల్ మేనేజ్‌మెంట్, బీబీఏ ఈ కామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీఎస్సీ గేమింగ్, బీఎస్సీ గ్రాఫిక్ డిజైన్, బీఏ ఫర్మార్మింగ్ ఆర్ట్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీఎస్సీ యానిమేషన్, బీకాం ఫైనాన్స్ లాంటి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అయితే 2023లో బీఎస్సీ హానర్స్ అండ్ కంప్యూటర్స్ కోర్సును ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. ఈ కోర్సుతో విదేశాల్లో ఎంఎస్ చేసే చాన్స్ ఉన్నట్లు లింబాద్రి తెలిపారు. కొత్త కోర్సులు తీసుకొస్తూ విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటుందన్నారు.

Spread the love