ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్షకు ఉన్న ఒక్క నిమిషం నిబంధన సడలించింది. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఎగ్జామ్ రాసేందుకు స్టూడెంట్స్‌ను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌కు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Spread the love