నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు ఇకపై ఉ.5.30 గంటల నుంచే ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉ.5.30 గంటలకే రైళ్లు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. దీంతో ప్రతిరోజూ అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.